Select Page

శ్రీ దత్తజయంతి మహోత్సవం ఆహ్వాన పత్రిక- 2019

శ్రీ జ్ఞానరాజ్ మాణికప్రభు

వికారీనామసంవత్సరం 1941, శ్రీమాణిక శకం 202

శ్రీభక్తకార్యకల్పద్రుమ గురుసార్వభౌమ శ్రీమద్రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద
నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీసద్గురు మాణిక్‌ప్రభు మహారాజ్ కీ జయ్!

ప్రపంచంలోని ప్రతి ఒక వస్తువు పనితో లేదా క్రియతో సాధ్యమవుతుంది. కానీ ప్రభుపరమాత్మను ఏ క్రియతో కానీ పనితో కానీ పొందడం జరుగదు. వారు కర్మసాధ్యులు లేదా క్రియ సాధ్యులు కాదు. ప్రతి కర్మకు ఆది మరియ అంతము ఉంటుంది. ప్రభువు అనాద్యానంతులు అవడం వల్ల కర్మతో వారిని పొందడం అసంభవం. “న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానషు:’ అన్న ఈ శృతి యొక్క భావము ఇలా ఉంది.”” ఏ సాధనతోనైనా ఉపాయంతోనైనా కర్మతో అయినా నేను ప్రభుపరమాత్మను పొందగలననుకోవడం మూర్ఖత్వ లక్షణమవుతుంది. ప్రభువును పొందటం ఎప్పుడూ జరగదు ఎందుకంటే వారు సదా ప్రాప్తులయి ఉన్నారు. ఎదైతే నిత్యప్రాప్తమయినదో దాన్ని పొందడం ఎలా అవుతుంది? ఎదైతే ఎల్లప్పుడూ సిద్ధిస్తుందో దాని సిద్ధి ఎలా జరుగుతుంది? కర్మ, ఉపాసన, యోగం, జప-తప, హోమం-హవనం మొదలైన సాధనాల ద్వారా వెలకట్టి నేను ప్రభువును కొనుక్కోగలనని అనుకోవడం పూర్తిగా మూర్ఖత్వం. ఈ సాధనాల ద్వారా ప్రభు ప్రాప్తించరు.ప్రభు స్వతఃగా ఇలా అంటారు – యోగ యాగ విధి యేణె నోహె సిద్ధీ లాగ తూ సద్గురు పాయీ॥ అంటే యోగ యాగాలతో సిద్ధి ప్రాప్తించదు. కేవలం దానిని పొందటం కోసం సద్గురు చరణాలను పట్టుకోవడం ఒక్కటే మార్గము. భగవద్గీతలోని 11వ అధ్యాయంలో శ్రీ భగవాన్ ఇలా అంటారు – నాహం వేదైనం తపసా న దానేన చేజ్యయా శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా॥ (అర్జునా, నీవు నన్ను ఎలా చూశావో అలా నా చతుర్భుజ రూప దర్శనం వేదాలతో తపంతో దానంతో మరియు యజ్ఞంతో దొరకడం సాధ్యం కాదు) కర్మ, ఉపాసన, యోగం, జపం-తపం, హోమం-హవనం వంటి సాధనాలతో ఒకవేళ ప్రభుపరమాత్మను పొందగలిగితే దాని విలువ ఆ సాధనాలకంటే కూడా అల్పమయినదని అర్థం. వ్యవహారాలలో కూడా మనం చూస్తూ ఉంటాము మనం బజారుకు వెళ్ళి ఒక వస్తువుకు ధర చెల్లించి ఎదైతే వస్తువు మనం కొంటామో ఆ వస్తువు యొక్క నిజమైన ధర మనం ఇచ్చిన దాని కంటే తప్పకుండా తక్కువగానే ఉంటుంది. మీరు బజారుకు వెళ్ళి అక్కడ ఒక దుకాణంలో నుండి 25000 రూపాయలు ఇచ్చి ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి. దుకాణదారుడు మీకు దానిని 25000 లకు ఇచ్చాడు అంటే ఆ మోబైల్ ఫోన్ నిజమైన ధర 25000 కంటే తప్పకుండా తక్కువగానే ఉంటుంది, కారణం ఏ దుకాణదారుడు కూడా నష్టపోతూ వ్యాపారం చేయడు. ఆ విధంగానే మీరు ఒక వేళ ఒకలక్ష జపం చేసి, లేదా పది యాగాలు చేసి, లేదా 5 తీర్థయాత్రలు చేసి లేదా లక్షరూపాయలు దానం చేసి ప్రభువును పొందుదామనుకుంటే అది మీ జపం కంటే హోమాల కంటే యాత్రల కంటే దానం కంటే ప్రభువిలువ తప్పకుండా తక్కువే అవుతుంది. తక్కువ విలువగల ప్రభువు మనకు ఎందుకు? మరి మనం ఏం చేయాలి, ఏ ఉపాయంతో ప్రభువును పొందాలి అని కనుక అడిగితే దానికి శ్రీభగవాన్ గీతలో ఇలా సమాధానం ఇచ్చారు – భక్త్యా త్వనన్యయా శక్యమహమేవంవిధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప॥ (కానీ ఓ అర్జునా! అనన్య భక్తితోనే ఈ విధంగా చతుర్భుజధారినైన నన్ను ప్రత్యక్షంగా చూడడం, నా స్వరూప రహస్యాన్ని తెలుసుకోవడం, నాతో ఏకరూపమవడం సాధ్యం.) ఈ విషయం భక్తి యొక్క అభివ్యక్త భావం నుండే తెలుస్తుంది. మరియు ఆ భక్తిభావం ప్రకటించడానికి శ్రీదత్తజయంత్యుత్సవం వంటి సందర్భం మనముందుకు నడిచి వస్తుంది. అందువల్ల ఇది తెలియజేయడంలో అత్యంత ఆనందం కలుగజేసే విషయం ఏమిటంటే శ్రీ ప్రభువు యొక్క మహామంగళ ప్రదమైన 202 వ శ్రీ దత్తజయంతి మహోత్సవం పక్కన ఇవ్వబడిన కార్యక్రమానుసారం మార్గశీర్ష శుక్ల ఏకాదశి, ఆదివారం 8 డిసెంబర్ 2019 నుండి మార్గశీర్ష బహుళ ప్రతిపద శుక్రవారం 13 డిసెంబర్ 2019 వరకు అత్యంత వైభవోపేతంగా జరుపబడనున్నది. అందువల్ల మీరందరూ ఈ సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి శ్రీదర్శనం చేసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి భజనానంద క్రీడలలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయగలరు.

PROGRAM

Sunday 8th December 2019

06:41 AM Suprabhat Seva
07:30 AM Maharudrabhishekam & Japam
10:30 AM Rajopachar Mahapooja
03:00 PM Aaradhana
08:30 PM Maha-Prasad

Monday 9th December 2019

10:00 AM Sanagam Snaan
11:00 AM Maharudrabhishekam & Japam
02:00 AM Rajopachar Mahapooja
08:30 PM Maha-Prasad

Tuesday 10th December 2019

09:00 AM Maharudrabhishekam & Japam
03:00 PM Dakshina Darbar
08:30 PM Maha-Prasad

Wednesday 11th December 2019

09:00 AM Maharudrabhishekam & Japam
11:00 AM Guru-Poojan
06:00 PM Manik Pournima Parva
08:30 PM Maha-Prasad

Thursday 12th December 2019

09:00 AM Maharudrabhishekam & Japam
01:00 PM Darshan & Padyapooja
07:00 PM Rajopchar Mahapooja
09:00 PM Maha-Prasad

Friday 13th December 2019

11:30 PM Prabhu Darbar begins
12:00 Midnight: Prabhu Janmotsava
12:30 AM Sangeet Sabha

 

* This program is subject to change in extra ordinary and unavoidable circumstances.

Donate for Datta Jayanti Annadaan

ANNADAAN forms an integral and important part of the Annual Datta Jayanti Mahotsav, wherein thousands of visiting devotees, irrespective of caste, creed or religion, partake of the bliss of MAHA PRASAD. An estimated 1 lakh devotees will be provided MAHA PRASAD during this year’s Datta Jayanti Mahotsava beginning 8th December 2019. You can associate yourself with the ANNADAAN SEVA by sponsoring any one or more of the following PRASAD ITEMS that will be prepared in the Bhadarkhana during the Mahotsav. All donations towards Datta Jayanti Annadaan are exempt from income tax under Section 80-G of the Indian Income Tax Act, 1961. You can click on one or more items to make a donation.